ఉదయాన్నే మంచినీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు
సూచిస్తున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా మంచి నీళ్లు పని
చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగడం మంచిదని
వైద్యులు నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, నీరు తాగిన తర్వాత కనీసం ఓ గంట
వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా ఉదయనే నీరుతాగడం
వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అలాగే, కొత్త
రక్తం తయారీకి, కండర కణజాల అభివద్ధికి ఎంతగానో సహయడుతాయాని వైద్యులు
అంటున్నారు. ఉదయాన్ని నీటిని తాగడం వల్ల 20 నుంచి 25 శాతం మేరకు శరీర
మెటబాలిజాన్ని పెంచుకుంది. ఇదే కాకుండా శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో
ద్రవపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా పోరాడుతుంది.
కాబట్టి ఉదయనే మంచి నీళ్లు తగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
No comments:
Post a Comment