కార్మిక బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని హోంగార్డులు, విలేకరులకు
రూ. 5 లక్షల బీమా కల్పించామని తెలంగాణ హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని
నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 10 లక్షల మందికి లబ్ది
చేకూరుతుందని అన్నారు. శుక్రవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
కార్మిక బీమాపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి నాయిని నర్సింహా
రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. 18 నుంచి 70 సంవత్సరాల వారికి బీమా పథకం
వర్తిస్తుందన్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని
చెప్పారు.
No comments:
Post a Comment