Friday, 4 September 2015

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి

బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో ముఖ్యకేంద్రంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ నిత్యావసర వస్తువుల పంపిణీదారుల సమాఖ్య బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జుగల్ కిషోర్ లోయా, కార్య దర్శి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వ్యాపార, వాణిజ్యవర్గాలు మండల తహశీల్దార్ కె.శ్యామ లదేవికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపా రులు మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి మాత్రమే కేంద్రంగా ఉందన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయడం వల్ల ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలు, స్థలం, ఇతర మౌళిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వంద గ్రామాలకు బెల్లంపల్లి కేంద్రంగా ఉందన్నారు. హైదరాబాద్ - నాగ్ పూర్ జాతీయ రహదారి కలిగి ఉండి రోడ్డు, రైల్వే సదుపాయాలు ఉన్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనులు, దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేక సిరామిక్స్ ఫ్యాక్ట రీలు బెల్లంపల్లి దరిదాపుల్లోనే ఉన్నాయన్నారు. భవిష్యత్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు డోకా లేని విధంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపా రులు కమల్ బజాజ్, సీహెచ్.గణపతి, సంపత్ సోమాని, జగన్మోహన్, పలూరి రమేశ్, సురేశ్, రాము చిట్లాంగి, వి.రమేశ్, గోవింద్, కె.శ్రీధర్, వికాస్ యాదవ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment