Tuesday, 8 September 2015

బెల్లంపల్లిలో ముస్తాబైన గణనాథులు











ఈ నెల 17 వ తేదీన వినాయకచవితి సమీపిస్తుండడంతో మన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అమ్మకానికి సిద్ధమైన వినాయక విగ్రహాలు.

Saturday, 5 September 2015

అందుబాటులోకి రైల్వే స్మార్ట్ కార్డులు


మంచిర్యాల సిటీ : ప్రయాణికులు ఏటీవీఎం ద్వారా టికెట్టు పొందడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్లో స్మార్ట్కారులు అందుబాటులో ఉన్నాయని స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏ శరవరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్డు కాలపరిమితి ఏడాది అని పేర్కొన్నారు. కార్డుదారులు టికెట్టు బుకింగ్ వద్ద వేచిఉండకుండా ఏ సమయంలోనైనా నేరుగా ఏటీవీఎం ద్వారా టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. రీచార్టీ చేయించుకుంటే ఐదు శాతం అదసపు మొత్తం కార్డులో జమ అవుతుందని, ఈ కార్డును దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు కావాల్సినవారు ఏదేని గుర్తింపు కార్డుతో తమసు సంప్రదించాలని సూచించారు.

Friday, 4 September 2015

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో కృష్ణాష్టమి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో  కృష్ణాష్టమి సందర్బంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషదారణలో అలరించారు. తర్వాత ఉట్టి కొట్టి డాన్సులు మరియు పాటలు పాడారు. అలాగే  ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతి విద్యార్థులకు పాటాలు బోధించారు. మరియు గురువు దేవునితో సమానం అని విద్యార్థులు స్కూల్ ఉపాధ్యాయులకు సన్మానం చేసారు. ఈ కార్యక్రమం లో స్కూల్ డైరెక్టర్ ఈరబత్తుల రవిప్రసాద్, ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి

బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో ముఖ్యకేంద్రంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ నిత్యావసర వస్తువుల పంపిణీదారుల సమాఖ్య బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జుగల్ కిషోర్ లోయా, కార్య దర్శి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వ్యాపార, వాణిజ్యవర్గాలు మండల తహశీల్దార్ కె.శ్యామ లదేవికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపా రులు మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి మాత్రమే కేంద్రంగా ఉందన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయడం వల్ల ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలు, స్థలం, ఇతర మౌళిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వంద గ్రామాలకు బెల్లంపల్లి కేంద్రంగా ఉందన్నారు. హైదరాబాద్ - నాగ్ పూర్ జాతీయ రహదారి కలిగి ఉండి రోడ్డు, రైల్వే సదుపాయాలు ఉన్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనులు, దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేక సిరామిక్స్ ఫ్యాక్ట రీలు బెల్లంపల్లి దరిదాపుల్లోనే ఉన్నాయన్నారు. భవిష్యత్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు డోకా లేని విధంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపా రులు కమల్ బజాజ్, సీహెచ్.గణపతి, సంపత్ సోమాని, జగన్మోహన్, పలూరి రమేశ్, సురేశ్, రాము చిట్లాంగి, వి.రమేశ్, గోవింద్, కె.శ్రీధర్, వికాస్ యాదవ్ పాల్గొన్నారు.

బెల్లంపల్లిని జిల్లాగా మార్చాలని సీపీఐ తీర్మానం

బెల్లంపల్లి: సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లిని జిల్లా చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. సభ్యులు దర్ని సత్యనారాయణ, కత్తెరశాల పోశం తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మేకల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

హమాలీల సంక్షేమానికి కృషి

-బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలి 
-సేవాభావం మహోన్నతమైనది
-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి : కష్టజీవులైన హమాలీల సంక్షేమానికి శా యశక్తులా కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మున్సిపల్ అధ్యక్షురాలు సునితారాణి హమాలీలకు 25 వేలతో కొనుగోలు చేసిన దుస్తులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో పం పిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిన్య య్య చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం కల్పించిన ఇన్సూరెన్సు సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్మికులకు ఎవైన సమస్యలు ఉంటే తనదృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారాని కి కృషి చేస్తానని చెప్పారు. రెక్కల కష్టంతో బతుకుబండిని సాగదీస్తున్న హమాలీ కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. బెల్లంపల్లి మున్సిప ల్ అధ్యక్షురాలు పసుల సునీతారాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పసుల సురేశ్ ఆధ్వర్యంలో చిన్నహమాలీ లు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. గత పాలకులు హమాలీలను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌లో వారు చేరారని అన్నా రు. సురేశ్‌పై నమ్మకంతో పార్టీలో చేరిన హమాలీలకు అన్నివిధాలుగా న్యా యం చేస్తామని హామీ ఇచ్చారు.వారికే సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిం ఞచడానికి ఎల్లవేల అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పసుల సురేశ్, బెల్లంపల్లి ఎం పీపీ సుబాశ్‌రావు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

జామ ఆకులతో ఆరోగ్య చిట్కాలు

చాలా మంది జామపండును ఇష్టపడతారు. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా, చాలా రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, మనలో చాలా మందికి, జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.
1.శరీరబరువును తగ్గిస్తుంది
జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులుస్ కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.
2. మధుమేహులకు ఉరట
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.
3. గుండె సంబంధిత సమస్యల నుండి విముక్తి
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.
4. డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం
డయేరియా & రక్త విరేచనాలను తగ్గించుటలో జామ ఆకులు శక్తివంతమైన హెర్బల్ ఔషదంగా పని చేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో ఒక పిడికెడు బియ్యపు పిండి మరియు 30 గ్రాముల జామ ఆకులను వేడి చేయండి. రోజు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగటం వలన విరేచనల నుండి ఉపశమనం పొందుతారు. రక్త విరేచనలను తగ్గించుటకు- 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జామ వేర్లను మరియు ఆకులను కలిపి 20 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి, రక్త విరేచనాలు తగ్గే వరకు రోజు తాగండి.
5. జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ, జీర్ణాశయంలో, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. జామ ఆకులు కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, జీర్ణాశయ గోడలపై ఉండే హానికర బ్యాక్టీరియాను మరియు వాటి నుండి విడుదలయ్యే రసాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. జామ ఆకులు వాంతులు మారియు డోకుల నుండి తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.

అల్లం టీ తో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు

అల్లం టీ తో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత్తం చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది చుండ్రుతో జుట్టు రావడం పెద్ద సమస్యగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం వాతావరణ కాలుష్యం వలన మాత్రమే రాదని వైద్యులు అంటున్నారు. శారీరక, మానసిక సమస్యలు ఏర్పడితే కూడా జుట్టు రాలిపోతుంది. ప్రతి రోజూ అల్లం టీ క్రమం తప్పకుండా తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు వెల్లడించారు. అల్లం టీ వలన ఆరోగ్య సమస్యలు కుడా తలెత్తవని వైద్యులు సూచిస్తున్నారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విద్యార్దులు

బెల్లంపల్లి: జూనియర్ కాలేజీ కొత్త భవనాన్ని ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని విద్యార్ధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసాన్ని విద్యార్ధులు ముట్టడించి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్లంపల్లిలో జూనియర్ కాలేజీ కొత్త భవనానికి ప్రభుత్వం రూ. 2.5 కోట్లు మంజూరు చేసింది.
అయితే సదరు భవనాన్ని మరో చోట నిర్మించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ విషయం తెలిసి విద్యార్ధులు ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విద్యార్ధులు శుక్రవారం ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.

హోంగార్డులు, విలేకరులకు 5 లక్షల బీమా: నాయిని

కార్మిక బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని హోంగార్డులు, విలేకరులకు రూ. 5 లక్షల బీమా కల్పించామని తెలంగాణ హోంశాఖ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్రంలో 10 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు. శుక్రవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్మిక బీమాపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. 18 నుంచి 70 సంవత్సరాల వారికి బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

Thursday, 3 September 2015

బెల్లంపల్లి పట్టణ జనాభా

బెల్లంపల్లి పట్టణ జనాభా:
1981 జనాభా లెక్కల ప్రకారం 90000 మంది
1991 జనాభా లెక్కల ప్రకారం 66780 మంది
2001 జనాభా లెక్కల ప్రకారం 66792 మంది
2011 జనాభా లెక్కల ప్రకారం 56320 మంది

ర్యాగింగ్ భూతం దిష్టిబొమ్మ దహనం

ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ర్యాగింగ్ భూతందిష్టిబొమ్మను దహనం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో దిష్టిబొమ్మ తగుల బెట్టారు. ర్యాగింగ్ కు బలైన రామకృష్ణాపూరుకు చెందిన సాయినాథ్ కు నివాళులు అర్పించారు. ఐక్యవిద్యార్ధి సంఘం నాయకులు మాట్లాడుతూ సాయినాథ్ మృతికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ తో ఎంతోమంది విద్యార్ధుల ప్రాణాలు గాల్లో కలి సిపోతున్నాయన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ చేయకుండా ప్రభు త్వాలు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐక్యవిద్యార్ధి సంఘం నాయకులు కృష్ణదేవరాయలు, పాపారావు, కె.చంద్రశేఖర్, ఆదర్శ్ వర్ధన్, మురళీశ్రావణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిని జిల్లా చేసే వరకు ఉద్యమం

బెల్లంపల్లి పట్టణం: బెల్లంపల్లిని జిల్లాగా చేసే వరకు ఉద్య మిస్తామని ఎంసీపీఐ(యు) జిల్లా కార్య దరి సబ్బని కృష్ణ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు జిల్లాలోని కొంతమంది వ్యాపారులు తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసమే మంచిర్యాల జిల్లాగా చేయాలని పట్టుబ డుతున్నారన్నారు. మంచిర్యాలను జిల్లాగా చేస్తే కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా మంచిర్యాలను జిల్లాగా చేస్తామని ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు బెల్లంపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమించాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లిని జిల్లా కేంద్రంగా చేసేవరకు అన్ని పార్టీలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలు చేపడతామన్నారు. సమావే శంలో ఎంసీపీఐ నాయకులు జాగాటి రాజలింగం, సబ్బని రాజేంద్రప్రసాద్, పి.వెంకటేష్, కె.చంద్రశేఖర్, జి.నగేష్, ఎండీ. జాకీర్ తదితరులు పాల్గొన్నారు

భక్తులతో బాబా గుడి...

గురువారము కావడంతో భక్తులతో కిట కిటలాడుతున్న మన బెల్లంపల్లి సాయిబాబా గుడి.

Wednesday, 2 September 2015

ఉదయాన్నే నీళ్లు తాగితే.

ఉదయాన్నే మంచినీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారిణిగా మంచి నీళ్లు పని చేస్తాయి. ఉదయాన్నే నిద్రలేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగడం మంచిదని వైద్యులు నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, నీరు తాగిన తర్వాత కనీసం ఓ గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా ఉదయనే నీరుతాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అలాగే, కొత్త రక్తం తయారీకి, కండర కణజాల అభివద్ధికి ఎంతగానో సహయడుతాయాని వైద్యులు అంటున్నారు. ఉదయాన్ని నీటిని తాగడం వల్ల 20 నుంచి 25 శాతం మేరకు శరీర మెటబాలిజాన్ని పెంచుకుంది. ఇదే కాకుండా శరీర బరువును తగ్గిస్తుంది. శరీరంలో ద్రవపదార్థాన్ని కోల్పోకుండా, ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా పోరాడుతుంది. కాబట్టి ఉదయనే మంచి నీళ్లు తగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఈ బుడతడు పుస్తకాల పురుగు

న్యూయార్క్ : భావోద్వేగాన్ని కలిగించే మంచి పుస్తకాలు చదివితే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. పట్టుమని ఏడాది కూడా లేని ఈ బుడతడికి పుస్తకం చదివి వినిపిస్తే తదేక దృష్టితో వింటాడు. ఆనందంగా నవ్వుతాడు. కథ ముగిసిందంటూ పుస్తకం మూసేస్తే బేర్ మంటూ ఏడుస్తాడు. అప్పటికీ పట్టించుకోకపోతే తల నేలకు కొట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తాడు. అదే పుస్తకాన్ని తీసి మళ్లీ చదవడం మొదలుపెడితే హఠాత్తుగా ఏడుపు ఆపేసి.. మళ్లీ తదేక దృష్టితో కథను వింటాడు. అమెరికాలో ఉంటారని అనుకుంటున్న ఆ తల్లి ఎప్పుడూ ‘ఐ యామ్ ఏ బన్నీ' అనే పిల్లల పుస్తకాన్ని కొడుకు ముందు చదివేది. 'ది ఎండ్' అంటూ పుస్తకాన్ని మూయగానే కొడుకు ఏడ్చేవాడు. మళ్లీ పుస్తకాన్ని తీసి 'లెట్స్ రీడిట్ ఎగైన్" అనగానే బాలుడు ఇరుకుంటాడు. ఆ తల్లి పేరు, కొడుకు పేరు తెలియదు. కొడుకు వింత ప్రవర్తనను వీడియో తీసిన తల్లి దాన్ని ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు అది ఇంటర్ నెట్ లో ఎంతో హల్చల్ చేస్తోంది. 




బెల్లంపల్లిలో మినీ ట్యాంక్ బండ్ పనులకు శ్రీకారం

నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి పట్టణంలో పోచమ్మ గుడి దగ్గర పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పరిసరాలను చదును చేశారు. కాగా బుధవారం చెరువు కట్టపై పలు సోలార్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. దీంతో చెరువు పరిసరాల్లో కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి.

అందమైన ముఖాన్ని అందహీనంగా మార్చే నల్లని మచ్చల నివారణ కోసం

అందమైన ముఖాన్ని అందహీనంగా మార్చే నల్లని మచ్చలనే మంగు మచ్చలని అంటారు. సీతాకోకచిలుక రెక్కలను పోలి ఉండే ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుండి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ వ్యాధిని ఆయుర్వేదంలో ‘వ్యంగ’మని అంటారు.

 

కారణాలు

శరీరతత్వాన్ని బట్టి బొబ్బలు, మొటిమలు వ్యాపించటం.. చర్మానికి తగిలిన గాయాలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు, పుట్టు మచ్చలు మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. వంశపారంపర్యం గానూ, హార్లోన్లలో సమతుల్యత లోపించడం వల కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను పోగొట్టడానికి సులభ చికిత్స లేంటో తెల్సుకుందాం.

 గేదె పాలను చిలికి తీసిన వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే మచ్చలు తగ్గుతాయి.  

పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి గేదె పాలల్లో నూరి రాస్తుంటే మంగు మచ్చలు తగ్గి చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. 

జాజికాయను మేక పాలలో అరగదీసి రాయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. 
పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. 

పావు టీ స్పూన్‌ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
టొమాటోల గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటిలో కడగాలి. వ్యంగ మచ్చలు తగ్గి శరీర కాంతి కూడా వస్తుంది. 

కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూయాలి. ఆ మచ్చలపై తడి ఆరిపోయాక చల్లని నీటితో శుభరం చేసుకోవాలి. దీని వల్ల మచ్చలు తగ్గిపోతాయి. దీంతో పాటు ముఖంపైన ఉండే మొటిమల మంట, వాపు తగ్గుతుంది.  

1 టీ స్పూన్‌ టొమాటో రసం, 1 టీ స్పూన్‌ గంధం పొడి కలిపి, 2 టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 

రోజ్‌ వాటర్‌, కీరా దోస రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెలలో చక్కని మార్పు వస్తుంది. 

ఆలుగడ్డపై ఉన్న పొరను తొలగించి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి రసం తీయాలి. దానిలో దూది నానబెట్టి మచ్చలపై పూసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే మచ్చలు తొలిగిపోతాయి.

Tuesday, 1 September 2015

ఆరు లక్షల బైక్ తో జంప్ అయిపోయాడు

Man escaped with 6 lakhs worth bike

ఈ మద్య కొత్త పంధాలో దొంగతనాలు జరుగుతున్నాయి . మంచి రిచ్ లుక్ ఇవ్వడం త్రిల్ అని చెప్పి జంప్ అవ్వడం . ఇలాంటిదే ఒకటి హైదరాబాద్ లో జరిగింది . మంచి సూటు బూటు వేసుకుని బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూంకు మంగళవారం ఓ యువకుడు వచ్చాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అని నెలకు రూ.లక్షన్నర జీతం ఉంటుందని , జూబ్లీహిల్స్ రోడ్ నం. 23లో నివాసముంటున్నట్లు చెప్పాడు. అయితే ఇదంతా నమ్మేసిన షో రూం వాళ్ళు ఇతనికి ట్రయల్ కి ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన బైక్ ని ఇచ్చారు.

అయితే వాళ్ళు ఇతనిని నమ్మడానికి కారణం , ఈ ప్రభుద్దుడు వాళ్ళకు , తన దగ్గర క్రెడిట్ కార్డు వుంది అని , దానిలో కొంచెం అమౌంట్ తో బైక్ తీస్కుని మిగిలిన అమౌంట్ ఫైనాన్సు లో ఇస్తా అని చెప్పాడు . పాపం ఇదంతా గుడ్డిగా నమ్మేసి ఆరు లక్షల బైక్ ని వాడి చేతిలో పెట్టారు . అంతే ఇంకా మనోడు ఆగుతాడా , తుర్ర్ మంటూ వెళ్ళిపోయాడు . ఒక నిమిషం , రెండు నిముషాలు , ఐదు నిముషాలు , గంట , రెండు గంటలు . . . . . ఇంకా రాకపోయే సరికి మనోళ్ళకి మోస పోయామని తెలిసి పోలీస్ లకి కంప్లైంట్ ఇచ్చారు. సిసి టీవీ పూటేజి ని పరిశీలిస్తున్నారు . చూడడం ఈ కథ కంచికి చేరుతుందో లేదో.

www.facebook.com/bellampallypowerr