Tuesday, 8 September 2015

బెల్లంపల్లిలో ముస్తాబైన గణనాథులు











ఈ నెల 17 వ తేదీన వినాయకచవితి సమీపిస్తుండడంతో మన బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అమ్మకానికి సిద్ధమైన వినాయక విగ్రహాలు.

Saturday, 5 September 2015

అందుబాటులోకి రైల్వే స్మార్ట్ కార్డులు


మంచిర్యాల సిటీ : ప్రయాణికులు ఏటీవీఎం ద్వారా టికెట్టు పొందడానికి మంచిర్యాల రైల్వే స్టేషన్లో స్మార్ట్కారులు అందుబాటులో ఉన్నాయని స్టేషన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏ శరవరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్డు కాలపరిమితి ఏడాది అని పేర్కొన్నారు. కార్డుదారులు టికెట్టు బుకింగ్ వద్ద వేచిఉండకుండా ఏ సమయంలోనైనా నేరుగా ఏటీవీఎం ద్వారా టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు. రీచార్టీ చేయించుకుంటే ఐదు శాతం అదసపు మొత్తం కార్డులో జమ అవుతుందని, ఈ కార్డును దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డు కావాల్సినవారు ఏదేని గుర్తింపు కార్డుతో తమసు సంప్రదించాలని సూచించారు.

Friday, 4 September 2015

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో కృష్ణాష్టమి మరియు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో  కృష్ణాష్టమి సందర్బంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా చిన్నారులు కృష్ణుడు, గోపిక వేషదారణలో అలరించారు. తర్వాత ఉట్టి కొట్టి డాన్సులు మరియు పాటలు పాడారు. అలాగే  ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతి విద్యార్థులకు పాటాలు బోధించారు. మరియు గురువు దేవునితో సమానం అని విద్యార్థులు స్కూల్ ఉపాధ్యాయులకు సన్మానం చేసారు. ఈ కార్యక్రమం లో స్కూల్ డైరెక్టర్ ఈరబత్తుల రవిప్రసాద్, ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి

బెల్లంపల్లి : తూర్పు ప్రాంతంలో ముఖ్యకేంద్రంగా ఉన్న బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ నిత్యావసర వస్తువుల పంపిణీదారుల సమాఖ్య బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జుగల్ కిషోర్ లోయా, కార్య దర్శి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వ్యాపార, వాణిజ్యవర్గాలు మండల తహశీల్దార్ కె.శ్యామ లదేవికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపా రులు మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి మాత్రమే కేంద్రంగా ఉందన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయడం వల్ల ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు, సింగరేణి భవనాలు, స్థలం, ఇతర మౌళిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వంద గ్రామాలకు బెల్లంపల్లి కేంద్రంగా ఉందన్నారు. హైదరాబాద్ - నాగ్ పూర్ జాతీయ రహదారి కలిగి ఉండి రోడ్డు, రైల్వే సదుపాయాలు ఉన్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనులు, దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అనేక సిరామిక్స్ ఫ్యాక్ట రీలు బెల్లంపల్లి దరిదాపుల్లోనే ఉన్నాయన్నారు. భవిష్యత్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు డోకా లేని విధంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపా రులు కమల్ బజాజ్, సీహెచ్.గణపతి, సంపత్ సోమాని, జగన్మోహన్, పలూరి రమేశ్, సురేశ్, రాము చిట్లాంగి, వి.రమేశ్, గోవింద్, కె.శ్రీధర్, వికాస్ యాదవ్ పాల్గొన్నారు.

బెల్లంపల్లిని జిల్లాగా మార్చాలని సీపీఐ తీర్మానం

బెల్లంపల్లి: సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లిని జిల్లా చేయాలని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీర్మానించారు. సభ్యులు దర్ని సత్యనారాయణ, కత్తెరశాల పోశం తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, మేకల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

హమాలీల సంక్షేమానికి కృషి

-బీమా సదుపాయాన్ని వినియోగించుకోవాలి 
-సేవాభావం మహోన్నతమైనది
-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి : కష్టజీవులైన హమాలీల సంక్షేమానికి శా యశక్తులా కృషి చేస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మున్సిపల్ అధ్యక్షురాలు సునితారాణి హమాలీలకు 25 వేలతో కొనుగోలు చేసిన దుస్తులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో పం పిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిన్య య్య చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వం కల్పించిన ఇన్సూరెన్సు సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్మికులకు ఎవైన సమస్యలు ఉంటే తనదృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారాని కి కృషి చేస్తానని చెప్పారు. రెక్కల కష్టంతో బతుకుబండిని సాగదీస్తున్న హమాలీ కార్మికులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. బెల్లంపల్లి మున్సిప ల్ అధ్యక్షురాలు పసుల సునీతారాణి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పసుల సురేశ్ ఆధ్వర్యంలో చిన్నహమాలీ లు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. గత పాలకులు హమాలీలను పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే టీఆర్‌ఎస్‌లో వారు చేరారని అన్నా రు. సురేశ్‌పై నమ్మకంతో పార్టీలో చేరిన హమాలీలకు అన్నివిధాలుగా న్యా యం చేస్తామని హామీ ఇచ్చారు.వారికే సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిం ఞచడానికి ఎల్లవేల అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పసుల సురేశ్, బెల్లంపల్లి ఎం పీపీ సుబాశ్‌రావు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

జామ ఆకులతో ఆరోగ్య చిట్కాలు

చాలా మంది జామపండును ఇష్టపడతారు. ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా, చాలా రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ, మనలో చాలా మందికి, జామ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యంటీ ఆక్సిడెంట్ గుణాలను మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్న జామ ఆకులు చాలా రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకుల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి కింద తెలుపబడింది.
1.శరీరబరువును తగ్గిస్తుంది
జామ ఆకులు శరీరంలో సంక్లిష్ట పిండి పదార్థాలు, చక్కెరలు గా మారటాన్ని నివారించి, శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది. జామ ఆకులుస్ కాలేయంలో కార్బోహైడ్రేట్లు విచ్చిన్నం జరిగి, అవసరమయ్యే పదార్థాలుగా మారే ప్రక్రియను నియంత్రించటం ద్వారా శరీర బరువు తగ్గటాన్ని ప్రేరేపిస్తుంది.
2. మధుమేహులకు ఉరట
జపాన్ లోని “యకుల్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్” వారు జామ ఆకుల నుండి తయారు చేసిన టీపై పరిశోధనలు జరిపారు. జామ ఆకుల నుండి తయారు చేసిన టీ ని మధుమేహ వ్యాధి గ్రస్తులు తాగటం వలన వారి శరీరంలో ఆల్ఫా-గ్లూకోసైడేజ్ ఎంజైమ్ చైతన్యత తగ్గటం వలన సమర్థవంతంగా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది శరీరంలో సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించటాన్ని తగ్గించి వేయటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కనీసం 12 వారాల పాటూ జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అధికం అవకుండా, శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఈ పరిశోధనల ఫలితంగా వెల్లడించారు.
3. గుండె సంబంధిత సమస్యల నుండి విముక్తి
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ రక్త ప్రసరణ వ్యవస్థకు మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. జామ ఆకులలో రక్త పీడనం మరియు హృదయ స్పందనల రేటును తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి. జామ ఆకుల నుండి తయారు చేసిన టీని తాగటం వలన రక్తంలో లిపిడ్ ల స్థాయి మెరుగుపడి, చెడు కొవ్వు పదార్థాల మరియు అనారోగ్యకర ట్రై-గ్లిసరైడ్ ల స్థాయిలు తగ్గుతాయి.
4. డయేరియా & రక్త విరేచనాల నుండి ఉపశమనం
డయేరియా & రక్త విరేచనాలను తగ్గించుటలో జామ ఆకులు శక్తివంతమైన హెర్బల్ ఔషదంగా పని చేస్తుంది. రెండు గ్లాసుల నీటిలో ఒక పిడికెడు బియ్యపు పిండి మరియు 30 గ్రాముల జామ ఆకులను వేడి చేయండి. రోజు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగటం వలన విరేచనల నుండి ఉపశమనం పొందుతారు. రక్త విరేచనలను తగ్గించుటకు- 90 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జామ వేర్లను మరియు ఆకులను కలిపి 20 నిమిషాల పాటూ వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి, రక్త విరేచనాలు తగ్గే వరకు రోజు తాగండి.
5. జీర్ణక్రియలో మెరుగుదల
జామ ఆకుల నుండి తయారు చేసిన టీ, జీర్ణాశయంలో, జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రోత్సహించి, జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది. జామ ఆకులు కలిగి ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు, జీర్ణాశయ గోడలపై ఉండే హానికర బ్యాక్టీరియాను మరియు వాటి నుండి విడుదలయ్యే రసాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. జామ ఆకులు వాంతులు మారియు డోకుల నుండి తక్కువ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.